I Wish You the Happy Christmas & Prosperous New Year

Showing posts with label Telugu Bible Quiz. Show all posts
Showing posts with label Telugu Bible Quiz. Show all posts

Monday, 26 December 2011

Telugu Bible Quiz

బైబిల్ క్విజ్ - 1

1. ఆదాము నుండి ఏసు ప్రభువుకు ఎన్ని తరాలు ?
2. జెబెదయి కుమారులు ఎవరు ?
3. అబ్రహాము జీవించిన సంవత్సరములు ?
4. మొట్టమొదటి క్రైస్తవులు ఎవరు ?
5. ప్రకటన 4:1 లో ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఎవరిని పిలిచాడు?
6. బైబిలు గ్రంథంలో అబద్దం చెప్పినందుకు మరణించిన దంపతులు ఎవరు?
7. యెహెజ్కేలు చూచిన దర్శనంలో నాలుగు ముఖరూపములు ఏవి?
8. యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఎప్పుడు?
9. యెహోవా నాతాను ప్రవక్తద్వారా సోలోమోనుకు పెట్టిన పేరు?
10. ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను అని యే వచనంలో ఉంది?

సమాధానాలు :

1. (ఆదాము – అబ్రహాము 14, అబ్రహాము – దావీదు 14, దావీదు - ఏసుక్రీస్తు 14) మొత్తం 42 తరాలు.
2. యోహాను, యాకోబు
3. 175
4. అంతియోకాయ లో శిష్యులు.
5. యోహాను
6. అననియు సప్పిరా
7. మానవ, సింహము, ఎద్దు, పక్షిరాజు.
8. షేతుకు కుమారునికి ఎనోషు అను పేరు పెట్టిననాటి నుండి.
9. యదిద్యా.
10. రోమా 5:8

బైబిల్ క్విజ్ - 2

1. తూర్పు దేశపు జ్ఞానులు దేనిని చూచి యెరూషలేమునకు వచ్చిరి? ఎందుకు వచ్చిరి?
2. సువార్తలలో ఉన్న దానిని బట్టి మొదటి క్రిస్మస్ ఎక్కడ జరపబడింది?
3. యేసుని చంపించాలని పన్నాగం పన్నిన రాజు ఎవరు?
4. యేసుక్రీస్తు జననం గూర్చి ఈ ప్రవచనం ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును అని పలికిన ప్రవక్త ఎవరు?
5. తూర్పు దేశపు జ్ఞానులు యేసుని కనుగొని,కలుసుకొనుటకు వచ్చినప్పుడు ఆయనకు సుమారుగా ఎంత వయసు కలదు?
6. ఎన్ని దినములకు బాలుడైన యేసుకు సున్నతి చేసారు?
7. రోమీయులు జరుపుకొనే మన క్రిస్మస్ లాంటి పండుగ ఏది?
8. యే దూత ద్వారా మరియకు ప్రత్యక్షమై ఎలీసబెతు గర్భవతి అని తెలియజేసింది?
9. ఎన్ని మాసములు మరియ ఎలీసబెతు తో కలిసి వుండెను?
10. మరియ గర్భవతియైన ఎలీసబెతును ఎవరి ఇంటిలో కలిసింది?

సమాధానాలు :

1. నక్షత్రం
2. బెత్లెహేము లో యేసు వుండిన ఇంటిలో
3. హేరోదు
4. యెషయా
5. రెండు సంవత్సరముల లోపు
6. 8
7. సతుర్నలియా
8. గాబ్రియేలు
9. 3 నెలలు
10. జెకర్యా

బైబిల్ క్విజ్ - 3

1. ఏ దినమున దేవుడు జంతువులను సృజించెను?
2. ఎవరి మాట విని ఆదాము దేవుడు తినవద్దన్న పండు తినెను?
3. అందరికంటె ఎక్కువ దినములు బ్రతికిన మనుష్యుడు ఎవరు?
4. మొట్ట మొదటి శాపము దేవుడు ఎక్కడ, ఎవరిని శపించెను?
5. ఎవని రక్తము యొక్క స్వరము నేలలో నుండి దేవునికి మొరపెట్టెను?
6. హవ్వ అని పేరు పెట్టినది ఎవరు? హవ్వ అనగా అర్ధమేమి?
7. కయీను శపింపబడిన తర్వాత ఎక్కడ నుండి ఎక్కడకు బయలుదేరెను?
8. ఎనోషు అనగా అర్ధమేమి?
9. ఆదాము నుండి నోవహుకు ఎన్ని తరములు?
10. ఏడంతలు ప్రతిదండన కయీను కోసం వచ్చిన యెడల మరి ఎవరి కోసం డెబ్బది ఏడంతలు వచ్చును?

సమాధానాలు:

1.6
2.హవ్వ
3.మెతుషెల
4.ఏదెను, హవ్వ, సర్పము
5.హేబెలు
6.ఆదాము, జీవము గల ప్రతివానికి తల్లి
7.యెహోవా సన్నిధి నుండి నోదు దేశమునకు
8.బలహీనుడు
9.లెమెకు
10.8

బైబిల్ క్విజ్ – 4

1.ఏ పర్వతము మీద నోవహు దహనబలి అర్పించెను?
2.యెహోవా - నా ఆత్మ నరులతో ఎల్ల్లప్పుడును వాదించదు అని ఆది (6-10) అధ్యాయాలలో ఎక్కడ వుంది?
3.నెఫీలులు అనగా ఎవరు?
4.యెహోవా యెదుట పరాక్రమము గల వేటగాడు అను లోకోక్తి ఎవరి మీద వుండెను?
5.జల ప్రవాహము జరిగినపుడు నోవహుకు ఎన్ని సంవత్సరములు?
6.నిబంధన అనే పదము ఆది (6-10) అధ్యాయాలలో ఎన్ని సార్లు వుంది?
7.నోవహు అనగా అర్ధమేమి?
8.జల ప్రవాహము జరిగినపుడు ఎన్ని దినములు భూమి మీద నీళ్ళు ప్రబలెను?
9.జల ప్రవాహము తర్వాత నోవహు పంపిన నల్ల పావురము ఓడలో నుండి తిరిగి వెళ్ళి ఏమి తీసుకొని వచ్చెను?
10.ఎవరి సంతానము నుండి సముద్రతీరమందు వుండిన జనములు వ్యాపించెను?

సమాధానాలు :

1.అరారాతు
2.ఆది 6:3
3.బలత్కారులు
4.నిమ్రోదు
5.600
6.8
7.నెమ్మది
8.150
9.ఓలీవ చెట్టు ఆకు
10.గోమెరు కుమారుల నుండి

బైబిల్ క్విజ్ – 5

1. యెహోవా భూజనులందరి భాషను ఎక్కడ తారుమారు చేసెను?
2. మొట్ట మొదట ఇటుకలు తయారు చేయబడిన దేశము ఏది?
3. షేము నుండి అబ్రాము వరకు ఎన్ని తరములు?
4. అబ్రాముతో నిబంధన చేసుకున్న వారు ఎవరు?
5. రాజు లోయ అని ఏ లోయకు పేరు?
6. షాలేము రాజైన మెల్కీసెదెకు ఎవరు?
7. అబ్రాము మొట్ట మొదట యెహోవాకు ఎక్కడ ప్రార్ధన చేసెను?
8. అబ్రాముతో మొట్ట మొదట యెహోవా చేసిన నిబంధన ఆది(అధ్యా 11-15) లలో ఏక్కడ వుంది?
9. అబ్రాము తన సహోదరుడైన లోతు కోసం ఎంత మందితో యుద్ధమునకు వెళ్ళెను?
10. మొట్ట మొదట యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమైన ప్రదేశము ఏది? అప్పుడు అబ్రాము వయస్సు ఎంత?

సమాధానాలు

1. బాబెలు
2. షీనారు
3. 9
4. ఎష్కోలు,ఆనేరు,మమ్రే
5. షావే లోయ
6. సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు
7. బేతెలుకు,హాయికి మధ్య తన గుడారములో
8. ఆది 15:21
9. 318
10. హారాను,75 సం॥లు

Thursday, 16 December 2010

Jude(యూదా వ్రాసిన పత్రిక)


యూదా వ్రాసిన పత్రిక

  1. యేసుక్రీస్తు దాసుడును,యాకోబు సహోదరుడునైన యూదా,తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి,యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
  2. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక.
  3. ప్రియులారా,మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా,పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.
  4. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి యున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు.
  5. సంగతులన్నియు మీరు ముందటనే యెరిగియున్నను,నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను,వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను.
  6. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక,తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను,మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.
  7. ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు,పరశరీరానుసారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.
  8. అటువలెనే వీరును కలలు కనుచు,శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు.
  9. అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించినప్పుడు,దూషించి తీర్పుతీర్చ తెగింపక-ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను.
  10. వీరైతే తాము గ్రహింపని విషయములనుగూర్చి దూషించువారై,వివేకశూన్యములగు మృగములవలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మునుతాము నాశనముచేసికొనుచున్నారు.
  11. అయ్యో వారికి శ్రమ.వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి,బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి,కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి.
  12. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మునుతాము నిర్భయముగా పోషించుకొనుచు,మీ ప్రేమవిందులలో దొంగమెట్టలుగా ఉన్నారు.వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక,రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను,
  13. తమ అవమానమను నురుగు వెళ్లగ్రక్కువారై,సముద్రముయొక్క ప్రచండమైన అలలుగాను,మార్గము తప్పితిరుగు చుక్కలుగాను ఉన్నారు;వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి యున్నది.
  14. ఆదాము మొదలుకొని యేడవవాడైన హనోకుకూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను -ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును,వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు,
  15. భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.
  16. వారు తమ దురాశలచొప్పున నడుచుచు,లాభమునిమిత్తము మనుష్యులను కొనియాడుచు,సణుగువారును తమ గతినిగూర్చి నిందించువారునై యున్నారు;వారి నోరు డంబమైన మాటలు పలుకును.
  17. అయితే ప్రియులారా,అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలచొప్పున నడుచు పరిహాసకులుందురని
  18. మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసికొనుడి.
  19. అట్టివారు ప్రకృతి సంబంధులును ఆత్మ లేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు.
  20. ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు,పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు,
  21. నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు,దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొనియుండుడి.
  22. సందేహపడువారిమీద కనికరము చూపుడి.
  23. అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీరసంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు మాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి.
  24. తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును,తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును,శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,
  25. మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా,మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వ మును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.ఆమేన్.

3 John(యోహాను వ్రాసిన మూడవ పత్రిక)

యోహాను వ్రాసిన మూడవ పత్రిక


  1. పెద్దనైన నేను సత్యమునుబట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది.
  2. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.
  3. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్యప్రవర్తననుగూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని.
  4. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.
  5. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయు చున్నావు.
  6. వారు నీ ప్రేమనుగూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనులవలన ఏమియు తీసి
  7. కొనక ఆయన నామము నిమిత్తము బయలు దేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును.
  8. మనము సత్యమునకు సహాయ కులమవునట్టు అట్టివారికి ఉపకారముచేయ బద్ధులమై యున్నాము.
  9. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు.
  10. వాడు మమ్మును గూర్చి చెడ్డమాటలు వదరుచు, అది చాలనట్టుగా, సహోదరులను తానే చేర్చు కొనక, వారిని చేర్చుకొన మనస్సుగలవారిని కూడ ఆటంక పరచుచు సంఘములోనుండి వారిని వెలివేయుచున్నాడు; అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియ లను జ్ఞాపకము చేసికొందును.
  11. ప్రియుడా, చెడుకార్య మును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.
  12. దేమేత్రియు అందరివలనను సత్యమువలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడ అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము; మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు.
  13. అనేక సంగతులు నీకు వ్రాయవలసియున్నది గాని సిరాతోను కలముతోను నీకు వ్రాయ నాకిష్టము లేదు;
  14. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను; అప్పుడు ముఖాముఖిగా మాటలాడు కొనెదము. నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము.